×
Ad

Ustaad Bhagat Singh : తెలుగు, హిందీ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తుంది వీరే..

'తేరి' రీమేక్ గా రాబోతున్న సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించబోతున్న వారు ఎవరో తెలుసా..?

  • Published On : August 25, 2023 / 03:29 PM IST

Pawan Kalyan Ustaad Bhagat Singh Varun Dhawan VD18 Heroines

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం తమిళ్ హీరో విజయ్ నటించిన ‘తేరి’ ఆధారంగా తెరకెక్కుతుంది. ఆ మూవీ మెయిన్ ప్లాట్ మాత్రం తీసుకోని కథ మొత్తం చేంజ్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ ని రూపొందిస్తున్నారు. కాగా తేరి సినిమాలో ‘సమంత’, ‘ఎమీ జాక్సన్’ హీరోయిన్లుగా నటించారు. ఇక పవన్ సినిమా విషయానికి వస్తే.. ఒక హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ OG సెట్స్ నుంచి వీడియో లీక్.. నెట్టింట వైరల్!

మరో హీరోయిన్ గా సాక్షి వైద్య(Sakshi Vaidya) ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ‘తేరి’ని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ‘వరుణ్ ధావన్’ (Varun Dhawan) హీరోగా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ హీరోయిన్లుగా కీర్తి సురేష్ (Keerthy Suresh), వామికా గబ్బి (Wamiqa Gabbi) నటించబోతున్నారని సమాచారం. మరి తమిళంలో సూపర్ హిట్టుగా నిలిచిన తేరి కథ.. తెలుగు, హిందీ భాషల్లో ఎలాంటి రిజల్ట్ ని చూస్తుందో చూడాలి. కాగా ఉస్తాద్ మూవీ సెకండ్ షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో మొదలుకాబోతుంది.

Pushpa 2 : నేషనల్ అవార్డుతో సీక్వెల్ పై మరింత అంచనాలు.. రిలీజ్‌ కోసం ఆ డేట్ ఫిక్స్ చేశారట..!

ఒక ప్రత్యేక సెట్ లో ఒక పెద్ద షెడ్యూల్ ని దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేశాడట. సినిమాలోని మేజర్ పోర్షన్ షూటింగ్ ఈ షెడ్యూల్ లోనే పూర్తి కానుంది అని తెలుస్తుంది. గతంలో హరీష్ అండ్ పవన్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ఒక గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేయగా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ కి సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నాడు.