Pawan Kalyan : మా వదిన నాకు చాలా ద్రోహం చేసింది.. దాని వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను..
బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "మా వదిన చేసిన ద్రోహం మాటల్లో వర్ణించలేనిది" అంటూ చిరంజీవి సతీమణి సురేఖ గురించి వైరల్ కామెంట్స్ చేశాడు.
- gum 95921
- Published On : July 25, 2023 / 11:33 PM IST
Pawan Kalyan viral comments on Chiranjeevi wife Surekha at bro movie event
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీని సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి మెగా వారసులు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Varun Tej : సినిమా అయినా, రాజకీయం అయినా బాబాయ్ వెనుకే మా కుటుంబమంతా..
ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
ఈ పరిశ్రమ ఏ కుటుంబానికి చెందింది కాదు. అన్నయ్య చిరంజీవి గారు కూడా ఎటువంటి అండదండా లేకుండా ఒక దిగువ కుటుంబం నుంచి సినీ పరిశ్రమకి వచ్చారు. ఆయన పెద్ద స్టార్ అయ్యాక నన్ను హీరో అవుతావా అని అడిగారు. కానీ నేను మాత్రం ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటా నేను హీరో అవ్వను అని చెప్పను. కానీ నాలోని ఆర్ట్ ని గుర్తించి మా వదిన నన్ను సినిమాల పై ప్రోత్సహించింది. ఆ రోజు మా వదిన చేసిన తప్పు ఇవాళ మీముందు నన్ను నిలబెట్టింది. మా వదిన చేసిన ద్రోహం మాటల్లో వర్ణించలేనిది.
OG Movie : ఒక పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు.. కానీ డబల్ రేటుకి OG రైట్స్..!
ఇక హీరో అయ్యాక.. ఈ పరిశ్రమలో మా అన్నయ్య పెద్ద స్టార్ కదా అని పని చేయడం మానలేదు. అలాగే ఈ పరిశ్రమంతా మాదే అని మా కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఎవరు ఫీల్ అవ్వలేదు. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. మాలాంటి దిగువ కుటుంబం నుంచి చిరంజీవి గారు ఆ తరువాత మేము వచ్చి హీరోలు అయ్యినప్పుడు మీరెందుకు కాలేరు. ఇక్కడ మన స్థానం నిర్ణయించేది అభిమానులు, కుటుంబాలు కాదు.
