OG Movie : ఒక పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు.. కానీ డబల్ రేటుకి OG రైట్స్..!

పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ మూవీ OG నుంచి ఒక చిన్న ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాకుండానే ఓవర్ సీస్ రైట్స్..

OG Movie : ఒక పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు.. కానీ డబల్ రేటుకి OG రైట్స్..!

Pawan Kalyan OG Movie overseas rights deal close at double margin of Bheemla Nayak

Updated On : July 25, 2023 / 9:47 PM IST

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి ఒక పవర్ ఫుల్ యాక్షన్ మూవీ వచ్చి చాలా రోజులు అయ్యిపోయింది. దీంతో అభిమానులంతా పంజా వంటి ఒక హై ఓల్టేజ్ మూవీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ తరహాలో గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న సినిమా OG. సాహో ఫేమ్ సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ దాదాపు 50 శాతం పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

Game Changer : గేమ్ చేంజర్‌లో ఆరు కంటే ఎక్కువ సాంగ్స్.. అంతేకాదు హీరో థీమ్స్.. థమన్!

ఇటీవలే నాలుగో షెడ్యూల్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ షూటింగ్ పవన్ కళ్యాణ్ లేకుండానే హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. అయినాసరి ఈ మూవీ ఓవర్ సీస్ రైట్స్ భారీ ధరకి అమ్ముడు పోయాయని సమాచారం. పవన్ లాస్ట్ మూవీ భీమ్లా నాయక్ ధర కంటే డబల్ రేటుకి 18 కోట్లకు OG రైట్స్ డీల్ క్లోజ్ అయ్యినట్లు తెలుస్తుంది. గత 5 ఏళ్లగా పవన్ నుంచి రీమేక్స్ తప్ప ఒక స్ట్రెయిట్ మూవీ రాలేదు. దీంతోనే OG రైట్స్ అంత ధర పలికినట్లు సమాచారం.

RRR in Japan : జపాన్ ఆగని RRR సునామీ.. క్రిస్టొఫర్ నొలన్ 8 సినిమాల రికార్డు బ్రేక్..

కాగా ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తుండగా తమిళ్ స్టార్ యాక్టర్స్ అర్జున్ దాస్ (Arjun Das), శ్రియారెడ్డి (Sriya Reddy) తో పాటు బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. RRR నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.