RRR in Japan : జపాన్ ఆగని RRR సునామీ.. క్రిస్టొఫర్ నొలన్ 8 సినిమాల రికార్డు బ్రేక్..
జపాన్ లో RRR సునామీ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నొలన్ డైరెక్ట్ చేసిన 8 సినిమాల రికార్డు బ్రేక్ చేసింది. మరో మూడు మాత్రమే బ్యాలన్స్..

RRR in Japan crossed 8 Christopher nolan movie collections
RRR in Japan : రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ విజయయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలయికలో వచ్చిన ఈ మల్టీస్టారర్ చిత్రం పై ఇండియన్ ఆడియన్స్ కంటే జపాన్ ప్రేక్షకులు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 21న జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఇంకా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. ఇటీవలే ఈ మూవీ 275 రోజులను కూడా పూర్తి చేసుకుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా ఈ మూవీ సుమారు 140 కోట్ల 14 లక్షల వరకు కలెక్ట్ చేసినట్లు సమాచారం.
Baby OTT Release Date : బేబీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
దీంతో ఈ మూవీ హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నొలన్ (Christopher nolan) డైరెక్ట్ చేసిన 8 సినిమాల రికార్డు బ్రేక్ చేసేసింది. ఇప్పటివరకు జపాన్ లో క్రిస్టొఫర్ నొలన్ చిత్రాలు 11 రిలీజ్ అయ్యాయి. మరో మూడు చిత్రాలు Inception, Tenet, Dark Knight Rises రికార్డ్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. కాగా ఈ మూవీ ఇప్పటికే అక్కడ నమోదు అయిన పలు మర్వెల్ అండ్ DC సిరీస్ చిత్రాల రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసేసింది. ఇది ఇలా ఉంటే, ఇప్పటి వరకు జపాన్ RRR.. జాపనీస్ సబ్ టైటిల్స్ తో తెలుగు లాంగ్వేజ్ లో రన్ అయ్యింది.
Thaman : తమన్‌ను టార్గెట్ చేస్తున్న మహేశ్, మెగా ఫ్యాన్స్.. ఎందుకిలా..?
తాజాగా ఈ చిత్రాన్ని ఈ నెల 28న జపనీస్ లాంగ్వేజ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ సునామీ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఇండియాలో 100 రోజులు పైగా ఆడని ఈ చిత్రం జపాన్ లో సంవత్సరం పాటు ఆడేలా కనిపిస్తుంది. ఇక జపాన్ కలెక్షన్స్ తో RRR వరల్డ్ వైడ్ గా 1300 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి KGF ని వెనక్కి నెట్టి ఇండియన్ టాప్ 3 గ్రాసర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా కేజీఎఫ్ కూడా ఇటీవల జపాన్ లో రిలీజ్ అయ్యినప్పటికీ అది పెద్దగా అలరించలేకపోతుంది.
#RRRINJAPAN Completed 275+ days in japan in 49 screens ???
With nearly 140crs gross and 14 lakhs admissions ??
HistoRRRic run continues #Rrrmovie @RRRMovie #RRR #Ntr #RamCharan #rajamouli pic.twitter.com/Pv0WIT7w50
— Cinema Circuit (@Cinema_Circuit) July 24, 2023
#RRRinJapan#RRR crossed 8 of 11 ??????????? ????? movies in japan??????
Only films ahead of rrr are inception,tenet and dark knight rises?#rrrmovie #NaatuNaatu @RRRMovie @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/vaq8Gfi0Wb
— Cinema Circuit (@Cinema_Circuit) July 24, 2023
????#RRRinJAPAN ????
Here is the thread of ???+ famous HOLLYWOOD films that were surpassed by #RRRmovie in japan
(Both collections and footfalls)#RRR @RRRMovie @RRR_twinmovie pic.twitter.com/bqgMRadgqS— Cinema Circuit (@Cinema_Circuit) April 20, 2023