Pawan Kalyan : ‘భీమ్లానాయక్‌’లో పవన్ కళ్యాణ్‌తో పాట పాడిస్తా : థమన్

'అఖండ' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా థమన్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. ఇందులో భాగంగానే ‘భీమ్లానాయక్‌’లో పవన్‌కల్యాణ్‌తో పాటను

  • Published On : November 24, 2021 / 07:04 AM IST

Pk Thaman

Pawan Kalyan :   ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ కూడా టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పటికే 100 సినిమాలకు పైగా సంగీతం అందించాడు థమన్. ‘అల వైకుంఠపురం’ సినిమా సాంగ్స్ బాగా హిట్ అవ్వడంతో, యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టించడంతో థమన్ దశ తిరిగింది. ఇక అప్పట్నుంచి అన్ని పెద్ద సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం తమన్ చేతిలో దాదాపు 10 పెద్ద సినిమాలు ఉన్నాయి.

Manchu Vishnu : ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న మంచు విష్ణు

ఇక థమన్ కొత్త సింగర్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. తన సినిమాల్లోని పాటల ద్వారా ఎంతోమందికి ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చాడు. ఇక అప్పుడప్పుడు సెలబ్రిటీలతోను పాడిస్తాడు థమన్. అంతకుముందు ఎన్టీఆర్, సుమ లాంటి సెలబ్రిటీలతో పాడించాడు థమన్. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ తో పాడించాలని ట్రై చేస్తున్నాడు.

Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 హోస్ట్‌గా శృతి హాసన్?

‘అఖండ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా థమన్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. ఇందులో భాగంగానే ‘భీమ్లానాయక్‌’లో పవన్‌కల్యాణ్‌తో పాటను పాడించబోతున్నాను అని అన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా కొన్ని సినిమాల్లో పాటలు పాడారు. ఇప్పుడుభీమ్లా నాయక్ సినిమాలో కూడా పవన్ తో పాడించడానికి థమన్ పవర్ స్టార్ ని అడిగాడని సమాచారం. పవన్ ఇంకా సమాధానం చెప్పలేదు కానీ పవన్ ని ఒప్పించి పాడిస్తాను అని థమన్ చెప్పారు. దీంతో మరోసారి పవన్ తన అభిమానుల కోసం పాట పాడతారు అని తెలుస్తుంది.