Manchu Vishnu : ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న మంచు విష్ణు

ఇప్పటికే 'మా'లో సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చే పెన్షన్ ని పెంచాడు. ఆ తర్వాత ఆడవాళ్ళ రక్షణ కోసం కమిటీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు తన మూడో హామీని నెరవేర్చబోతున్నాడు. ఈ సందర్భంగా నిన్న మీడియా

Manchu Vishnu : ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న మంచు విష్ణు

Vishnu

Manchu Vishnu :  ‘మా’ అధ్య‌క్షుడుగా మంచు విష్ణు కొత్త ప్రయాణం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. గత అధ్యక్షుల కంటే భిన్నంగా వేగంగా వర్క్ చేస్తూ అందర్నీ మెప్పిస్తున్నాడు కూడా. ఎన్నికల వేల విష్ణు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు చూస్తే జనరల్ ఎలక్షన్స్ లో పొలిటీషియన్స్ ని మించిపోయాడు అనిపించింది. కానీ అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు.

Puneeth Rajkumar : త్వరలో పునీత్ బయోపిక్.. నా శక్తి మేరకు ట్రై చేస్తానంటూ దర్శకుడు ప్రకటన

ఇప్పటికే ‘మా’లో సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చే పెన్షన్ ని పెంచాడు. ఆ తర్వాత ఆడవాళ్ళ రక్షణ కోసం కమిటీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు తన మూడో హామీని నెరవేర్చబోతున్నాడు. ఈ సందర్భంగా నిన్న మీడియాతో మాట్లాడారు మంచు విష్ణు.

Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 హోస్ట్‌గా శృతి హాసన్?

మంచు విష్ణు మాట్లాడుతూ… ఇచ్చిన హామీ మేర‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) స‌భ్యుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నాను. అసోసియేషన్ సభ్యుల ఆరోగ్య పరిరక్ష‌ణ‌కు హైద‌రాబాద్‌లోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ హాస్పిటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాను. ఈ హాస్పిటల్స్ లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్, ఎమ‌ర్జెన్సీ వేళ ఫ్రీ అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తారు. క‌నుక ‘మా’ స‌భ్యులు ఈ హాస్పిటల్స్ లో నిరంత‌రం త‌మ ఆరోగ్యాన్ని తక్కువ ధరలో చెక్ చేసుకోవ‌చ్చని పేర్కొన్నారు.

Anee Master : బిగ్ బాస్ 11 వారాలకి యాని మాస్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

అంతేకాక వైద్య నిపుణుల‌తో ఫేస్ టు ఫేస్ సంప్ర‌దింపుల‌తో పాటు వీడియో క‌న్స‌ల్టేష‌న్ కూడా చేసుకోవ‌చ్చు. అలాగే అసోసియేషన్ సభ్యులందరికీ దశల వారీ ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. వ‌చ్చేనెల‌లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్ హాస్పిటల్స్ లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. వీటితో పాటు టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లోనూ ‘మా’ సభ్యులకు రాయితీపై రోగ నిర్దారణ పరీక్షలు చేయించనున్నామ‌ని పేర్కొన్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒక్కో హామీని నెరవేరుస్తూ కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు అందరి మన్ననలు పొందుతున్నాడు.