Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 హోస్ట్‌గా శృతి హాసన్?

తెలుగులో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుంటే తమిళ్ లో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల బిగ్‌బాస్‌ హోస్ట్ అందుబాటులో లేకపోతే..............

Bigg Boss 5 : బిగ్‌బాస్ 5 హోస్ట్‌గా శృతి హాసన్?

Sruthi

Bigg Boss 5 :  ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా బిగ్ బాస్ నడుస్తుంది. తెలుగు, తమిళ్ లో బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తుంది. తెలుగులో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుంటే తమిళ్ లో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల బిగ్‌బాస్‌ హోస్ట్ అందుబాటులో లేకపోతే వారి స్థానంలో మరొక సెలబ్రెటీని తీసుకొస్తారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. గతేడాది తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 హోస్ట్‌ నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో సమంత కూడా హోస్ట్‌ చేసింది. స్టార్‌ హీరోయిన్‌ కావడంతో ఆ వీకెండ్‌ ఎపిసోడ్స్‌ కి మంచి ఆదరణ లభించింది. తాజాగా తమిళ బిగ్‌బాస్‌లో కూడా ఇదే జరిగేలా కనిపిస్తుంది.

Pooja Hegde : నా కల నెరవేరింది : పూజ హెగ్డే

తమిళ్ బిగ్ బాస్ కు కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన అమెరికా పర్యటనకు వెళ్లొచ్చి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం కమల్ ఐసోలేషన్ లో ఉన్నారు. మరో రెండు వారాల వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ రెండు వారాలు తమిళ్ బిగ్ బాస్ కి మరో హోస్ట్ ని పెట్టాల్సిందే.

Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దు.. కోలుకుంటున్నట్టు కూతురు ప్రకటన

దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు కమల్‌ స్థానంలో హోస్ట్‌గా ఆయన కూతురు శ్రుతీ హాసన్‌ను తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేశారని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితిలో వేరే ఎవర్నైనా హోస్ట్ గా పెట్టాల్సిందే. అదే శ్రుతి హాసన్‌ను హోస్ట్‌గా పెడితే కమల్ హాసన్ కూతురు కావడంతో షో మరింత ఆసక్తిగా మారుతుందని భావిస్తున్నారు నిర్వాహకులు. ఇదే ఉద్దేశంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు శ్రుతిని కూడా సంప్రదించారట. అయితే ఆమె ఇంకా ఎటువంటి సమాధానం చెప్పలేదు. మరి దీనికి ఆమె ఓకే చెప్తుందో లేదో చూడాలి. శృతి హాసన్ ఓకే చెప్తే రెండు వారాల పటు శృతి తమిళ్ బిగ్ బాస్ 5కి హోస్ట్ గా చేస్తారు. లేదా వేరే ఎవరో ఒక సెలబ్రిటిని తీసుకొస్తారు.