Pooja Hegde : నా కల నెరవేరింది : పూజ హెగ్డే

ఇటీవలే ఆచార్య, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసిన పూజ ఇన్ని రోజులు మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేసింది. మాల్దీవ్స్ లో తను బికినీతో దిగిన ఫోటోలను............

Pooja Hegde : నా కల నెరవేరింది : పూజ హెగ్డే

Pooja

Pooja Hegde :  ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వరుస హిట్లు సాధిస్తూ దూసుకుపోతుంది పూజ హెగ్డే. ఒకవైపు తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా మెల్లి మెల్లిగా పాతుకుపోవడానికి ట్రై చేస్తుంది పూజ. ఇప్పటికే తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆమె డేట్స్ కోసం తిరుగుతున్నారు. ఇటీవలే ఆచార్య, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసిన పూజ ఇన్ని రోజులు మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేసింది. మాల్దీవ్స్ లో తను బికినీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి హీట్ పుట్టిస్తుంది.

Kaikala Satyanarayana : కైకాల ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దు.. కోలుకుంటున్నట్టు కూతురు ప్రకటన

తాజాగా పూజ ఇండియాకి తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి పూజ షేర్ చేసిన ఓ పిక్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది పూజ హెగ్డే. ఈ ఫోటో షేర్ చేస్తూ.. ”లెజెండ్ అమితాబ్ గారితో కలిసి వర్క్ చేయాలి, షూటింగ్ లో పాల్గొనాలి అనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కల. ఇవాళ నా కలల లిస్ట్ లో అది టిక్ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేను అమితాబ్ గారితో కలిసి వర్క్ చేశాను. నా కల నెరవేరింది. చాలా ఎక్కువ చెప్పేశాను. మరింత తెలుసుకోవడానికి వేచి ఉండండి” అని పోస్ట్ చేసింది.

Brahmanandam : బుల్లితెరపై ‘బ్రహ్మానందం’… ఆలీతో కలిసి రచ్చ.. టీఆర్పీలు బద్దలవ్వడం ఖాయం

ఆ ఫోటో, ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ .. బట్టి చూస్తే ఏదో యాడ్ కోసం ఇద్దరూ కలిసి వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఇది యాడ్ లేదా వేరే ఏదైనా షూటింగా తెలియాలి. అది తెలుసుకోవాలంటే వెయిట్ చేయమని పూజ తన పోస్ట్ లో చెప్పింది.