‘గబ్బర్ సింగ్’ కాంబో రిపీట్ – పవన్ కళ్యాణ్ 28 ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మైత్రీ మూవీస్ చిత్రం..

  • Publish Date - February 1, 2020 / 08:56 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మైత్రీ మూవీస్ చిత్రం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఓ పవర్ ప్యాక్ లాంటి సినిమా కోరుకుంటున్న ఫ్యాన్స్‌కి శనివారం ఓ శుభవార్త అందింది. రాజకీయాల కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న పవన్, ‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా కూడా ప్రారంభమైంది. ఇప్పుడు మరో సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన యువ దర్శకుడు హరీష్ శంకర్, రెండోసారి పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.

వరస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న పవన్‌కి ‘గబ్బర్ సింగ్’ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు హరీష్ శంకర్. మళ్లీ పీకే ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియచేస్తామన్నారు నిర్మాతలు.