మే 23న పవన్ ‘పింక్’ రీమేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిందీ ‘పింక్’ తెలుగు రీమేక్ మే 23న విడుదల..

  • Publish Date - January 27, 2020 / 10:32 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిందీ ‘పింక్’ తెలుగు రీమేక్ మే 23న విడుదల..

చిన్న విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు.. తన 26వ సినిమాగా ‘పింక్’ రీమేక్‌ని ఎంచుకున్నాడు. హిందీ, తమిళ్ భాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బోని కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథలో తెలుగు నేటివిటీ, పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు మార్పులు చేశారని, పవన్ పక్కన ఓ కథానాయిక కూడా ఉండబోతుందని ఫిలింనగర్ సమాచారం.

Read Also : చిరు టైటిల్‌తో శ్రీకాంత్ సినిమా

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు నిర్మాతలు.. మే 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. త్వరలో టైటిల్ అధికారికంగా ప్రకటించనున్నారు.