Pawan Kalyan
Pawan Kalyan: ఓజీ సినిమా దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్‌పై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఇవాళ ఓజీ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఇందులో పవన్ కల్యాణ్ సరదాగా మాట్లాడుతూ.. “ఓజీ సినిమా కోసం వీళ్లిద్దరు కలిసి నన్ను ఎలా తయారు చేశారంటే.. ఇవాళ తెల్లచొక్కా, జుబ్బా వేసుకుని వచ్చేద్దామనుకుంటే ఇలా బ్లాక్ డ్రెస్‌లో రమ్మని చెప్పారు. కళ్లజోడు పెట్టుకుని రావాలని అన్నారు.
మొన్న ఇలాగే అడిగితే కత్తి పట్టుకొచ్చాను. అప్పుడు వారు అడిగినదానికి ఓకే అన్నాను. నా జీవితంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. నేను కత్తి పట్టుకుని వస్తే వెనకాల మొత్తం గుంపు వచ్చింది. ఈ రోజు కళ్లజోడు పెట్టుకుని గన్‌తో రావాలని చెప్పారు. చంపేస్తాను అని చెప్పాను.
నా వీక్‌నెస్‌తో ఆడుకున్నారు. నాకు తుపాకులు, విపన్స్, కత్తులు, మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. వాళ్ల కోసం ఇప్పుడు మళ్లీ తుపాకీ పట్టుకుని ఫొటో అయితే ఇస్తానని చెప్పాను. ఇది రష్యన్ మేడ్ గన్. సెకండ్ వరల్డ్ వార్‌కి సంబంధించింది. మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్. పట్టువదలని విక్రమార్కుల్లాగా పట్టుబట్టారు. నా అభిమానుల కోసం, వీళ్ల కోసం ఈ గన్ పట్టుకుంటున్నాను” అని అన్నారు. తుపాకీని పట్టుకుని వేదికపై పోజులు ఇచ్చారు.