Hari Hara Veera Mallu : వీరమల్లు సెట్స్ నుంచి ఫోటో లీక్.. వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్..

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో పవన్.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తీ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే...

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా మొఘలుల కాలంనాటి కథాంశంతో తెరకెక్కుతుంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ విడుదల కానుంది. సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో పవన్.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తీ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు.

Pawan Kalyan : రీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకున్న పవన్ బ్లాక్ బస్టర్..

ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. సినిమాలోని కీలక యుద్ధ సన్నివేశాలను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడట. అందుకోసం ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ని కూడా వేయించాడట. పవన్ తో పాటు దాదాపు వెయ్యకు మాది ఆర్టిస్ట్ లు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా షూటింగ్ సమయంలో పవన్ తో ఆర్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తి దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. యుద్ధవీరుడు లుక్ లో ఉన్న పవన్ ఫోటోను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆ ఫోటోను షేర్లు మీద షేర్లు చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు