Pawan Kalyan : రీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకున్న పవన్ బ్లాక్ బస్టర్..

పూరీజగన్నాధ్ దర్శకుడిగా పరిచయం అవుతూ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బద్రి'. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ మూవీకి పవన్ సినిమాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాగా ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్దమవుతుంది.

Pawan Kalyan : రీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకున్న పవన్ బ్లాక్ బస్టర్..

Pawan kalyan badri movie re release date fix

Pawan Kalyan : పూరీజగన్నాధ్ దర్శకుడిగా పరిచయం అవుతూ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బద్రి’. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ మూవీకి పవన్ సినిమాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలోని పవన్ మేనరిజం, యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ ని యూత్ కి మరింత దగ్గరయ్యేలా చేశాయి. ఇక ఈ సినిమాలో పవన్ కి కోపం వచ్చినపుడు మెడపై చేయ్యిపెట్టే మేనరిజం అయితే పవన్ కళ్యాణ్ కి సిగ్నేచర్ లా మారిపోయింది.

Pawan Kalyan : రాజకీయ జీవితంపై జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు..

అలాగే ‘నువ్వు నందా అయితే ఏంటి, నేను బద్రి బద్రీనాథ్’ అనే డైలాగ్ యూత్ కి పూనకాలు తెప్పించింది. ‘బంగాళాఖాతంలో’, ‘ఏ చికిత్త’ అంటూ రమణ గోగుల ఇచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. రేణుదేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ వంటి తారలు ప్రధాన పాత్రల్లో నటించారు.

కాగా ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలంటూ వస్తున్న అభిమానుల కోరిక మేరకు 4K క్వాలిటీతో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 30న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో నిర్మాత అశ్విని దత్త్ ‘ఖుషి’ సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించాడు. ఇప్పుడు ఈ ప్రకటనతో ఖుషి రీ రిలీజ్ మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లే తెలుస్తుంది.