Anurag Kashyap రేప్ చేయబోయాడు – Actress Payal Ghosh

  • Publish Date - September 20, 2020 / 07:44 AM IST

#meetoo ఎన్ని ప్రకంపనలు రేకేత్తించిందో అందరికీ తెలిసిందే. ఈ ఆరోపణలు సద్దుమణిగిపోయాయని అనుకుంటున్న తరుణంలో నటి పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ రేప్ చేయబోయాడంటూ…సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడి ఆరోపణలు చేస్తూ…ట్వీట్ చేశారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పీఎంవోకు ట్యాగ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘అనురాగ్‌ కశ్యప్‌ చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి’ అని పాయల్ కోరారు. క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. బాలీవుడ్ లో ప్రకంపనలు రేకేత్తించింది.


తాను అవకాశాలు చూస్తున్న క్రమంలో…అనురాగ్ కశ్యప్ రూంకు పిలిపించుకున్నాడని, అసభ్యంగా తాకుతూ..వెకిలి చేష్టలకు పాల్పడ్డాడని పాయల్ ఆరోపించారు. బలవంతంగా లోబర్చుకొనే ప్రయత్నం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనతో పని చేసిన వాళ్ళందరూ పడుకున్నారని, నువ్వు కూడా పడుకో అన్నారని వెల్లడించారు.


దీనిపై National Commission for Women (NCW) chairperson Rekha Sharma స్పందించారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తుండగా..పాయల్ చేసిన ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.