Payal Rajput : ఆ హెల్త్ సమస్యతో బాధపడుతున్న పాయల్.. సర్జరీ చేయాల్సి వస్తే..

తాజాగా నిన్న శనివారం నాడు 'మంగళవారం'(Mangalavaaram) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.

Payal Rajput Effected with Kidney Issues says in Mangalavaaram Movie Trailer launch Event

Payal Rajput : RX100 సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ మొదటి సినిమాతోనే మెప్పించింది. బోల్డ్ సీన్స్, లిప్ కిస్ సీన్స్ కి సిద్ధమైనా పలు అవకాశాలు వచ్చినా అంతగా పాయల్ రాజ్‌పుత్ కి పేరు తీసుకురాలేకపోయాయి. తనని తెలుగు పరిశ్రమకి పరిచయం చేసిన RX100 డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో మరోసారి మంగళవారం అనే సినిమాతో రాబోతుంది.

తాజాగా నిన్న శనివారం నాడు ‘మంగళవారం'(Mangalavaaram) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. అలాగే తాను ఓ హెల్త్ సమస్యతో కూడా బాధపడుతున్నట్టు తెలిపింది పాయల్. పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. అజయ్ ఈ కథతో నన్ను అప్రోచ్ అయ్యేసరికి నా పరిస్థితి బాగోలేదు. ఇది ఎవ్వరికి తెలీదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాను. మందులు వాడుతున్నా సర్జరీ చేయాల్సిందే అని వైద్యులు చెప్పారు. కానీ ఈ కథ నచ్చడంతో, అజయ్ అడగడంతో సినిమా పూర్తయ్యాకే సర్జరీకి వెళ్తాను అని అప్పుడే అజయ్ కి చెప్పినట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ సర్జరీ పూర్తయిందా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు పాయల్.

Also Read : Rajinikanth : రజినీకాంత్ రోడ్డు మీద ఛాయ్ అమ్ముకుంటున్నారా?.. అచ్చు సూపర్ స్టార్ లాగే..

అలాగే.. RX100 తో అజయ్ భూపతి నన్ను సినిమాకు పరిచయం చేశారు. ఆ ఆతర్వాత కొన్ని తప్పుడు నిర్ణయాలతో కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమా ముందు వరకు నా కెరీర్ గందరగోళంగా ఉంది. ఏం చేయాలో అర్ధం కాలేదు. మళ్ళీ అజయ్ నాకు ఓ వరం ఇచ్చాడు అనిపించింది. ఈ సినిమా తెలుగులో మళ్ళీ నా కంబ్యాక్ లాంటిది అని చెప్పింది పాయల్.