Payal Rajput Mangalavaram Movie got 4 Awards Selection in Jaipur Film Festival
Mangalavaram : డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) మెయిన్ లీడ్ గా తెరకెక్కిన మంగళవారం సినిమా గత సంవత్సరం నవంబర్ 17న రిలీజయి భారీ విజయం సాధించింది. ఓ కొత్త రోగాన్ని హీరోయిన్ కి ఉన్నట్టు చూపించి చాలా బోల్డ్ గా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన మంగళవారం థియేటర్స్ లో భారీ విజయం సాధించింది. దాదాపు 5 కోట్లతో తెరకెక్కిన మంగళవారం 15 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హిట్ కొట్టింది.
మంగళవారం సినిమాని ప్రేక్షకులు, సినిమా విశ్లేషకులు కూడా మెచ్చుకున్నారు. ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో నాలుగు అవార్డులకు ఎంపికైంది. ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 13 వరకు జైపూర్ ఫిలిం ఫెస్టివల్(Jaipur Film Festival) జరగనుంది. ఈ ఫెస్టివల్ లో పలు సినిమాలు స్క్రీన్ చేయనుండగా ఇందులో భగవంత్ కేసరి, కార్తికేయ 2తో పాటు పలు తెలుగు సినిమాలు కూడా సెలెక్ట్ అయ్యాయి.
Also Read : Rashmika Mandanna : సౌందర్య బయోపిక్ చేయాలనుకుంటున్నా.. రష్మిక వ్యాఖ్యలు.. సౌందర్య బయోపిక్ వస్తుందా?
తాజాగా ఈ ఫెస్టివల్ లో పలు అవార్డులకు ఎంపికైన వారిని ప్రకటించారు. మంగళవారం సినిమాకు ఉత్తమ నటి(పాయల్ రాజపుత్), ఉత్తమ సౌండ్ డిజైన్(రాజా కృష్ణన్), ఉత్తమ ఎడిటింగ్(గుళ్ళపల్లి మాధవ్ కుమార్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్(ముదసర్ మొహమ్మద్) అవార్డులు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పలువురు చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు.