Rashmika Mandanna : సౌందర్య బయోపిక్ చేయాలనుకుంటున్నా.. రష్మిక వ్యాఖ్యలు.. సౌందర్య బయోపిక్ వస్తుందా?

గతంలోనే సౌందర్య జీవితాన్ని బయోపిక్ గా తెరకెక్కిస్తామని పలు వార్తలు వచ్చాయి. కానీ అవి ఇప్పటివరకు కార్య రూపం దాల్చలేదు.

Rashmika Mandanna : సౌందర్య బయోపిక్ చేయాలనుకుంటున్నా.. రష్మిక వ్యాఖ్యలు.. సౌందర్య బయోపిక్ వస్తుందా?

Rashmika Mandanna Wants to Act in Soundarya Biopic comments goes viral

Updated On : January 29, 2024 / 11:02 AM IST

Rashmika Mandanna : సినీ పరిశ్రమలో బయోపిక్ లు కొత్తేమి కాదు. ఎప్పుడూ ఏదో ఒక బయోపిక్ వస్తూనే ఉంటుంది. సినీ పరిశ్రమలోని గొప్ప వ్యక్తులే కాక, అన్ని రంగాల్లోని పలువురు ప్రముఖుల బయోపిక్స్ తెరకెక్కిస్తుంటారు. ఈ కోవలోనే ఒకప్పటి దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య బయోపిక్(Biopic) కూడా తీస్తారని గతంలో వార్తలు వచ్చినా అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.

1992 నుంచి 2002 వరకు దాదాపు 10 సంవత్సరాలు తెలుగు, కన్నడ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది సౌందర్య(Soundarya). ఒకప్పుడు మహానటి సావిత్రి గురించి ఎలా చెప్పుకున్నారో ఆ తర్వాత సౌందర్య గురించి అలా చెప్పుకున్నారు. తన నటన, వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ అనుకోకుండా ఓ హెలికాఫ్టర్ ప్రమాదంలో అర్దాంతరంగా 2004లో మరణించింది. ఆమె మరణం అభిమానుల్లో, తెలుగు ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో తీరని లోటుని ఏర్పరిచింది.

సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆమె నటనని, ఆమెని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అయితే గతంలోనే సౌందర్య జీవితాన్ని బయోపిక్ గా తెరకెక్కిస్తామని పలు వార్తలు వచ్చాయి. కానీ అవి ఇప్పటివరకు కార్య రూపం దాల్చలేదు.

Also Read : Nagarjuna : మళ్ళీ వచ్చే సంక్రాంతికి వస్తాను.. క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున.. 2025 సంక్రాంతి పోటీ ఫిక్స్..

తాజాగా రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యూలో.. నేను ఇండస్ట్రీకి రాకముందు మా నాన్న నేను కొంచెం సౌందర్య గారిలా ఉన్నాను అనేవాళ్ళు. ఒకవేళ నేను అలాగే ఉన్నాను అనిపిస్తే సౌందర్యగారి బయోపిక్ లో నటించాలని ఉంది. ఆమె జర్నీ అంటే నాకు చాలా ఇష్టం అని తెలిపింది. దీంతో ఇప్పుడు మరోసారి సౌందర్య బయోపిక్ చర్చగా మారింది. నటించడానికి రష్మిక రెడీగా ఉంది. మరి సౌందర్య బయోపిక్ ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి. సౌందర్య అభిమానులు కూడా ఆమె బయోపిక్ రావాలని కోరుకుంటున్నారు. సౌందర్య బయోపిక్ వస్తే సావిత్రి బయోపిక్ మహానటి లాగే అది కూడా ఒక క్లాసిక్ సినిమాలా నిలిచిపోతుంది.