Payal Rajput : పుష్పతో RX100 భామ.. తగ్గేదేలే అంటూ..

తాజాగా నిన్న నవంబర్ 11న 'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్(Allu Arjun) గెస్ట్ గా వచ్చి సందడి చేశారు.

Payal Rajput : పుష్పతో RX100 భామ.. తగ్గేదేలే అంటూ..

Payal Rajput Special Selfie With Allu Arjun in Mangalavaaram Pre Release Event

Updated On : November 12, 2023 / 9:13 AM IST

Payal Rajput : డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘మంగళవారం’ సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది. తాజాగా నిన్న నవంబర్ 11న మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్(Allu Arjun) గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తి పెంచారు. ఒక గ్రామంలో జరిగే హత్యల నేపథ్యంలో డార్క్ థ్రిల్లర్ గా మంగళవారం సినిమా ఉండబోతుంది.

ఇక అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కి రావడంతో బన్నీ అభిమానులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. ఈ ఈవెంట్ నుంచి అల్లు అర్జున్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మంగళవారం సినిమా హీరోయిన్, RX100 భామ పాయల్ రాజ్ పుత్ అల్లు అర్జున్ తో స్పెషల్ సెల్ఫీ తీసుకుంది. పుష్ప స్టైల్ లో తగ్గేదేలే అంటూ పాయల్, బన్నీ ఇద్దరూ ఫోజిస్తూ సెల్ఫీ తీసుకున్నారు.

Also Read : Allu Arjun : పుష్ప అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. షూటింగ్ ఎక్కడ? ఏ సీన్?

ఈ సెల్ఫీలని పాయల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇవి వైరల్ గా మారాయి. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని తెలిపాడు. వచ్చే సంవత్సరం ఆగస్టు 15 పుష్ప 2 సినిమా రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్.