Navakanth Master : క్రికెట్ ఫైట్ తో ఎంట్రీ.. హనుమాన్ ఎపిసోడ్.. ‘పెద్ది’ యాక్షన్ సీక్వెన్స్ లపై ఫైట్ మాస్టర్ కామెంట్స్ వైరల్..

నవకాంత్ మాస్టర్ నేడు మీడియాతో మాట్లాడుతూ పెద్ది సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ల గురించి మాట్లాడారు. (Navakanth Master)

  • Published on- May 16, 2026 / 04:03 PM IST

Navakanth Master

Navakanth Master : రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 4న పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా భారీగా రిలీజ్ కానుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీగా పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది టీమ్ పలువురు మీడియాతో మాట్లాడుతూ, ప్రమోషన్స్ చేస్తూ పెద్ది సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్తున్నారు.

తాజాగా పెద్ది సినిమాకు పనిచేసిన ఫైట్ మాస్టర్స్ లో ఒకరైన నవకాంత్ మాస్టర్ నేడు మీడియాతో మాట్లాడుతూ పెద్ది సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ల గురించి మాట్లాడారు.

Also Read : Chiranjeevi : ‘పెద్ది’ ట్రైలర్ పై చిరు లీక్స్.. దానికి మించి అంటూ మెగాస్టార్ ట్వీట్ వైరల్..

ఫైట్ మాస్టర్ నవకాంత్ మాట్లాడుతూ.. మీకు గ్లింప్స్ లో చూపించిన క్రికెట్ షాట్ తోనే హీరో ఎంట్రీ ఉంటుంది. క్రికెట్ బ్యాట్ తో కొత్తగా ఆ షాట్ కొట్టిన సీన్ నేనే డిజైన్ చేశాను. ఎంట్రీతోనే ఫైట్ సీన్ ఉంటుంది క్రికెట్ లో. మొత్తం 7 యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. నేను కాకుండా మరో నలుగురు ఫైట్ మాస్టర్స్ కూడా వర్క్ చేసారు. పోలీస్ స్టేషన్ ఫైట్ బాగుంటుంది. కుస్తీ పోటీల సీక్వెన్స్ లు ఉంటాయి. సెమి ఫైనల్స్, ఫైనల్స్ అంటూ కుస్తీ సీక్వెన్స్ లు ఉంటాయి. అక్కడే హనుమంతుడి రిఫరెన్స్ వచ్చేలా ఒక సీక్వెన్స్ ఉంటుంది.

రామ్ చరణ్ అసలు బాడీ డబల్ వాడలేదు. అన్ని ఫైట్స్ ఆయనే స్వయంగా చేసారు. దాదాపు 90 రోజులు అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు వెజ్ తింటూనే బాడీ మెయింటైన్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా చేసారు. ఆయన్ని చూసి నాకే ఏడుపొచ్చింది. కుస్తీ పోటీల్లో సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడే ఆయన కంటిపై గాయం అయింది. అయినా నెక్స్ట్ డే కుట్లు వేయించుకొని షూటింగ్ కి వచ్చారు. చాలా డెడికేషన్ గా చేసారు ఆయన. క్లైమాక్స్ అయితే ఎమోషన్ ఉంటుంది. అక్కడ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూసి కచ్చితంగా ఏడుస్తారు అని తెలిపారు. దీంతో పెద్ది సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండబోతున్నట్టు చరణ్ యాక్షన్ సీక్వెన్స్ లో, కుస్తీ పోటీలలో అదరగొట్టబోతున్నాడు అని తెలుస్తుంది.

Also Read : Nayanthara : పూల మధ్యలో లేడిసూప‌ర్ స్టార్‌.. నయనానందమే.. ఫ్యామిలీతో.. క్యూట్ ఫోటోలు వైర‌ల్‌