×
Ad

Pelli SandaD Teaser : నాగార్జున రిలీజ్ చేసిన దర్శకేంద్రుడి ‘పెళ్లి సందD’ టీజర్..

శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ‘పెళ్లిసందD’ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది..

  • Published On : September 14, 2021 / 06:55 PM IST

Pelli Sandad

Pelli SandaD Teaser: హీరో శ్రీకాంత్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుల కెరీర్లో ‘పెళ్లిసందడి’ సినిమా స్పెషల్ ఫిలిం.. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘పెళ్లిసందడి’ లో నటించిన శ్రీకాంత్ తనయుడు హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న సినిమా ‘‘పెళ్లిసందD’’.. ఆయన శిష్యురాలు గౌరి రోనంకి దర్శకురాలిగా, శ్రీలీల కథానాయికగా పరిచయమవుతున్నారు.

K Raghavendra Rao : ‘మౌనముని’ మాట్లాడబోతున్నారు.. నటుడిగా దర్శకేంద్రుడు!

ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ చేసిన ‘ప్రేమంటే ఏంటి’, ‘బుజ్జులు బుజ్జులు’ అలాగే ‘పెళ్లిసందD’ టైటిల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు దర్శకేంద్రుడు. ఆయన పోషిస్తున్న ‘వశిష్ట’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.

Nene Naa Movie : రెజీనా అదరగొట్టేసిందిగా..

రీసెంట్‌గా ‘పెళ్లిసందD’ టీజర్ కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు. టీజర్ చాలాబాగుందంటూ మూవీ టీంకి విషెస్ తెలియజేశారాయన. రోషన్ యాక్షన్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. శ్రీలీలను గ్లామరస్‌గా చూపించారు. విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, స్వరవాణి కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. త్వరలో ‘పెళ్లిసందD’ ప్రేక్షకుల ముందుకు రానుంది.