Nene Naa Movie : రెజీనా అదరగొట్టేసిందిగా..

రెజీనా డ్యుయెల రోల్ చేస్తున్న ‘నేనే నా..?! సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. అంచనాలు పెంచేసింది..

Nene Naa Movie : రెజీనా అదరగొట్టేసిందిగా..

Nene Naa Movie

Nene Naa Movie: సినిమా సినిమాకి యాక్టింగ్‌లో వేరియేషన్స్ చూపిస్తూ తన పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది రెజీనా క‌సాండ్ర‌. ఆమె రాణిగా, పురావస్తు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘నేనే నా..?! ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్‌తోనే ఆడియ‌న్స్‌లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రెజీనా కసాండ్రా పాన్-ఇండియన్ డొమైన్ అంతటా పాపులర్ అవడంతో ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Krishnam Raju : కాలుజారి పడ్డ కృష్ణంరాజు.. అపోలో ఆస్పత్రిలో సర్జరీ..

అలాగే ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ వంటి హిట్ త‌ర్వాత కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. మొద‌టి సినిమా ‘జాంబీరెడ్డి’ తో సూపర్ హిట్ సాధించిన రాజ్ శేఖర్ వర్మ త‌న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ ట్రైల‌ర్‌ను నిధి అగర్వాల్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి మరియు స్టార్ డైరెక్టర్ లింగుసామి రిలీజ్ చేశారు.

Manchu Manoj : చిన్నారి ఘటనపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్..

ట్రైలర్ చూస్తుంటే 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడు పునరావృతమవుతోంది అని తెలుస్తోంది. రెజీనా 100 సంవత్సరాల క్రితం రాణిగానూ.. ప్ర‌స్తుత కాలంలో పురావస్తు శాస్త్రవేత్తగా ఒక రహస్యమైన కేసును పరిష్కరించడానికి వచ్చిన‌ట్టు చూపించారు. అలాగే ఈ ట్రైల‌ర్లో అడవిలో ఏకాంత ప్రదేశంలోకి ప్రవేశించే వ్యక్తులతో పాటు, రహస్యమైన కేసును పరిష్కరించడానికి కేటాయించిన వారు కూడా చంపబడుతున్నారు.

Arya : ‘ఆర్య’ రోల్‌కి అల్లరి నరేష్‌ని అనుకున్నారట..

గత మరియు ప్రస్తుత కథల మధ్య లింక్ సినిమాకు కీలకం కానుంది. హర్రర్ ఎలిమెంట్స్ మరియు కామెడీతో కూడిన మిస్టరీ స‌బ్జెక్ట్ మూవీ ప్రేక్షకులకు త‌ప్ప‌కుండా సరికొత్త అనుభూతిని అందించ‌నుంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. తెలుగు మరియు తమిళంలో రూపొందించ‌బ‌డిన ఈ బైలింగ్వ‌ల్ మూవీలోని కీల‌క స‌న్నివేశాల‌ను కుర్తాళం మరియు చుట్టుపక్కల ప్రాంతాల‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘నేనే నా..?! చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.