యోగిబాబు సినిమా పోస్టర్‌పై తమిళ తంబీల ఆగ్రహం
వివాదంలో తమిళ హాస్య నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘COCKTAIL’ మూవీ పోస్టర్..
వివాదంలో తమిళ హాస్య నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘COCKTAIL’ మూవీ పోస్టర్..
తమిళనాట హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యోగిబాబు. ఇటీవల ‘గూర్ఖా’ అనే తమిళ సినిమాతో ఆకట్టుకున్నాడు. యోగిబాబు ప్రధాన పాత్రలో ‘Cocktail’ అనే సినిమా రూపొందుతుంది. విజయ మురుగన్ దర్శకత్వంలో పిజి మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళ్తే..
సోమవారం విడుదల చేసిన ‘Cocktail’ సినిమా పోస్టర్ వివాదాన్ని రగిల్చింది. ‘Cocktail’ టైటిల్ మద్యానికి సంబంధించిన పదం. అయితే పోస్టర్లో తమిళులు ఆరాధించే దైవం మురుగన్ వేషధారణలో ఉన్న యోగిబాబు స్టిల్ చూసి టైటిల్‌కి, పోస్టర్‌కి ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్న తలెత్తింది తమిళ తంబీలకు. ‘Cocktail’ టైటిల్‌గా ఉన్న సినిమాకి ఇలాంటి పోస్టర్ విడుదల చేయడం ఏమిటని పలువురు బహిరంగంగానే విమర్శిస్తునారు. ఈ విమర్శలపై చిత్రబృందం అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
ఎవరి మనోభావాల్ని కించపరిచేలా ఈ సినిమా కథగానీ, పోస్టరుగానీ రూపొందించ లేదని, తాను కూడా మురుగన్ భక్తుడినేనని, తన పేరులోనూ మురుగన్ ఉందని దర్శకుడు విజయ్ మురుగన్ వివరణ ఇచ్చారు. సినిమాలో యోగిబాబు కూడా మురుగన్ భక్తుడిగానే నటిస్తున్నారని, సినిమా చూశాక అందరూ హర్షిస్తారని లేఖలో పేర్కొన్నారు. త్వరలో ‘Cocktail’ టీజర్ రిలీజ్ కానుంది.
.@pgmediaworks Press release on #Cocktail Poster Issue.
@ravijayamurugan@iYogiBabu @muthaiahg @sdcpicturez @Fusmanfaheed @duraikanagaraaj @manirs_Dir @saibhaski @kawin_8483 @arunraja3020 @mimegopi @SOUNDARBAIRAVI @laharimusic @johnmediamanagr @itsjosephjaxson @CtcMediaboy pic.twitter.com/aKwPO9RNk2
— Ramesh Bala (@rameshlaus) February 4, 2020