ppi Pippi Dum Dum Dum Song out from Kuberaa movie
అక్కినేని నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రష్మిక మంధాన కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
Singer Mangli : సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి కలకలం..
ఇక తాజాగా మూడో పాటను రిలీజ్ చేసింది. ‘పీ పీ డుమ్ డుమ్..’ అంటూ ఈ పాట సాగుతోంది. చైతన్య రాసిన ఇంగ్లిష్ లిరిక్స్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. పాట మొత్తం ఇంగ్లిష్ పదాలతోనే ఉండడం విశేషం.
దేవీ శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.