PKSDT Movie update by producer TG Vishwaprasad
PKSDT Movie : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వరుసగా సినిమాలు చేస్తున్నారు. లైన్లో పెట్టిన సినిమాలన్నిటికీ డేట్స్ ఇస్తున్నారు. వీటిల్లో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తో కలిసి మల్టీస్టారర్ కూడా ప్లాన్ చేశారు. తమిళ్ లో వచ్చిన వినోదాయ సితం(Vinodaya Sitham) సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సముద్రఖని(samuthirakani) దర్శకత్వంలో పవన్, తేజ్ కలిసి ఇందులో నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పవన్ కేవలం 25 రోజులు డేట్స్ ఇచ్చి ఈ సినిమాలో తన పాత్ర షూట్ మొత్తం పూర్తి చేసేశారు. దీంతో ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇంకా ఈ సినిమాకు టైటిల్ ప్రకటించలేదు. #PKSDT వర్కింగ్ టైటిల్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసిన సినిమా అంతే ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటుంది. 28 జూన్ 2023న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో భారీ విజయం సాధించాడు. ఈ విజయంపై తేజ్ ని అభినందిస్తూ #PKSDT నిర్మాత TG విశ్వప్రసాద్ ఓ బొకే పంపించారు. తేజ్ దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్పగా విశ్వప్రసాద్ దానికి రిప్లై ఇస్తూ ఈ సినిమాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Movie on Galwan : ఇండియా-చైనా గాల్వాన్ ఇష్యూపై సినిమా.. తెరకెక్కించనున్న బాలీవుడ్ డైరెక్టర్
నీలాంటి ట్యాలెంటెడ్, హార్డ్ వర్క్ ఉన్న నటుడితో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కచ్చితంగా చెప్పగలను #PKSDT సినిమా అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. మనం ఆ సినిమాతో భారీ విజయం సాధిస్తాం, అందులో అసలు డౌట్ లేదు. కలిసి అద్భుతాన్ని సృష్టిద్దాం ఆ సినిమాతో అని #PKSDT నిర్మాత విశ్వప్రసాద్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మామ అల్లుడు కలిసి పనిచేస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Im happy to have the opportunity to collaborate with someone as passionate and dedicated as you @IamSaiDharamTej garu, im sure #PKSDT is going to be a fantastic experience, and I have no doubt that we'll achieve great things. Let's make some magic happen! ??" https://t.co/xfJEc4hcHI
— Vishwa Prasad (@vishwaprasadtg) April 25, 2023