Plan B
Plan B: కొత్త కథలతో, డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చిన చిన్న సినిమాలు కలెక్షన్స్ పరంగా పెద్ద సినిమాల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తున్నాయి. టాలీవుడ్‌లో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలు ఎక్కువగా విజయాలు సాధిస్తున్నాయి. సరికొత్త కథ, కథనంతో థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్లాన్ B’ మూవీ. పాపులర్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర, బ్లాక్ స్టార్ శాని మరియు నవీనా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మూవీ ప్రేక్షకుల్ని ఎంత వరకు ఎంటర్‌టైన్ చేసిందో చూద్దాం..
Bigg Boss 5 Telugu : ప్రోమోలో ఉన్నది ఏపిసోడ్‌లో ఉండదు.. అదే మ్యాజిక్..!
కథ..
రిటైర్డ్ పోలీసు అధికారి రాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర) హత్యకు గురవుతాడు. తాను చనిపోయే ముందు తన కూతురు అవంతిక (డింపుల్) కు రూ. 10 కోట్లు ఇచ్చి, అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొమ్మని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించ బడుతుంది. మరోవైపు లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి) ప్రైవేట్ టీచర్ అవంతిక భర్త రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. విశ్వనాథ్ ఫోన్ నుంచి తన తండ్రి ఫోన్‌కు హత్యకు గురైన ఫోటోలు వెళ్తాయి. దాంతో విశ్వనాథ్ హత్య గురించి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లాయర్ హత్య కేసు దర్యాప్తును ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాష్) చేపడతారు. లాయర్ విశ్వనాథ్ హత్య వెనుక అసలు కారణం ఏంటి? ఈ మర్డర్ మిస్టరీలో కీలకంగా మారిన గౌతమ్ (సూర్య వశిష్ట) ప్లాన్ ఏమిటి? లాయర్ విశ్వనాథ్‌ను, రిషి (అభినవ్ సర్దార్), రాజేంద్రలను ఎవరు, ఎందుకు హత్య చేస్తారు? అవంతికకు తండ్రి రాజేంద్ర ఇచ్చిన 10 కోట్ల రూపాయలు ఎలా మాయమయ్యాయి? విచారణలో ఏసీపీ(మురళీ శర్మ)కు ఎలాంటి నిజాలు తెలిశాయి, వాటిని తను ఎలా ఛేదించాడు.అసలు ప్లాన్ B అంటే ఏమిటి ? అది ఎవరు చేశారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే సినిమా థియేటర్స్‌కి వెళ్లి చూడాల్సిందే.
Ramya Krishnan : శివగామి బర్త్‌డే సెలబ్రేషన్స్.. స్టార్స్ అంతా ఒకే చోట..
నటీనటులు..
నటుడు శ్రీనివాస్ రెడ్డి ఎప్పటిలానే తన స్టైల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాకు ఎంతో కీలకమైన లాయర్ విశ్వనాథ్ పాత్రలో చాలా చక్కగా నటించాడు. గౌతమ్ పాత్రలో సూర్య వశిష్ట (త్రివిక్రమ్ శ్రీనివాస్ అసిస్టెంట్ స్వర్గీయ సత్యం కుమారుడు) పాత్ర అలరిస్తుంది. ఈ కథకు మెయిన్ పిల్లర్‌గా నిలవడమే కాకుండా కొత్త నటుడు అనే ఫీలింగ్ కలిగించకుండా తనదైన నటనతో మెప్పించాడు. ఫైట్ సీన్స్‌లో కూడా అవలీలగా నటించాడు. విలన్‌గా నటించిన కునాల్ శర్మ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఏసీపీగా నటించిన మురళీ శర్మ పోలీసు అధికారి పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ విధానం ఆకట్టుకుంటుంది. అభినవ్ సర్దార్, నవీనా రెడ్డి, సబీనా తదితరులంతా వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.
Bheemla Nayak : డైనమిక్ డానియెల్ శేఖర్ వచ్చేస్తున్నాడు..
సాంకేతిక నిపుణులు..
దర్శకుడు రాజమహి కృష్ణవంశీ, రాఘవేంద్ర రావు తదితరుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి విశేష అనుభవంతో కథను చక్కగా థ్రిల్లింగ్‌గా, చివర్లలో ఎమోషనల్‌గా మలచడంలో చక్కటి పరిణితిని చూపించాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన పాయింట్స్‌తో పలు రకాల ట్విస్టులతో దర్శకుడు రాజమహి రూపొందించిన కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి కథ ఓపెనింగ్ సీన్‌లోనే మర్డర్ కావడంతో ఆ పాత్రపై ఆసక్తి పెరుగుతుంది. కానీ క్లైమాక్స్‌లో శ్రీనివాస్ రెడ్డి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే అప్పటి వరకు అనేక సందేహాలున్న కథకు శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్‌తో అద్భుతమైన జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు. ఈ సినిమాలో అనేక ట్విస్టులు ఉండటంతో కథలో ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫి బాగుంది. మర్డర్ మిస్టరీకి కావాల్సిన లైటింగ్‌తో ప్రత్యేక మూడ్‌ను క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు.
Bigg Boss 5 Telugu : వైరల్ అవుతున్న విష్ణు ప్రియ కామెంట్స్..
కథలో ఉండే ట్విస్టులను ఆవుల వెంకటేష్ చక్కగా ఎడిట్ చేశారు. ఆవుల వెంకటేష్ ప్రతిభతోనే కథ ఆసక్తి కరంగా సాగింది. ప్రధానంగా శక్తికాంత్ కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సౌండ్, ఆర్ట్స్ విభాగాల పనితీరు బాగుంది. థ్రిల్లింగ్, క్రైమ్, మర్డర్ మిస్టరీతో కూడిన చిత్రంగా ‘ప్లాన్ B’ రూపొందింది. ప్రీ క్లైమాక్స్‌లో కృత్రిమ గర్భధారణ అంశం సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్తుంది. కృత్రిమ గర్భధారణ ట్విస్టుతో సినిమా ఫీల్‌గుడ్‌గా మారుతుంది. తన తొలి చిత్రంతోనే దర్శకుడు రాజమహి ఆకట్టుకొన్నారు. వైవిధ్యం, క్లిష్టమైన కథను ఎంచుకొని మెప్పించడం ఆయన టాలెంట్‌కు అద్దం పట్టిందని చెప్పవచ్చు. మర్డర్ మిస్టరీ, థ్రిలర్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ప్లాన్ B’ సినిమా నచ్చుతుంది.