Sai Durga Tej : ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి.. యాక్సిడెంట్ రోజును గుర్తుచేసుకున్న సాయి దుర్గ తేజ్..

మెగా హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా ప్రస్తుతం తన 18వ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Please wear a helmet Sai Durga Tej remembers the day of his accident

Sai Durga Tej : మెగా హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా ప్రస్తుతం తన 18వ సినిమాతో బిజీగా ఉన్నాడు. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తేజ్. ఈ మూవీ తర్వాత బ్రో అల‌రించారు. ఆ త‌రువాత‌ కాస్త బ్రేక్ తీసుకున్న తేజ్ ఇప్పుడు SDT18 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా 2025లో రానుంది. ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Also Read : 35-Chinna Katha Kaadu : ’35 చిన్న కథ కాదు’ సినిమాకి అరుదైన గౌరవం..

అయితే తాజాగా ఏబీపీ సౌత్ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ.. ముందుగా అందరికీ నమస్కారం లేడీస్, కెమెరామెన్ అందరికీ.. దయచేసి హెల్మెట్ ధరించండి. హెల్మెట్ నా జీవితాన్ని కాపాడింది. నా జీవితాన్ని తిరిగి నాకిచ్చింది. నా వైపు నుండి మీ అందరికి ఇదొక రిక్వెస్ట్ అంటూ తెలియజేశాడు. ఇక ఇదే విషయాన్ని తను హిందీ, ఇతర భాషల్లో చెప్పాడు.

ఇక 2021 సెప్టెంబరు 11 న తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ కి యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో తేజ్ తలకి పెద్ద దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళాడు. కంటి పై భాగానికి, ఛాతికి, కాలికి కూడా బలమైన గాయాలు కావడంతో మెగా ఫామిలీతో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం చాలా కంగారు పడ్డారు. ఇలాంటి ఒక పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డ తర్వాత తేజ్ ఇలా ఏ ఇంటర్వూస్ కి వెళ్లినా కూడా హెల్మెట్ గురించి ప్రస్తావిస్తున్నారు.