Lata Mangeshkar : లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. హాజరు కానున్న పీఎం నరేంద్ర మోదీ

ఆమె అంతక్రియలకు కూడా ప్రధాని హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె నివాసంలో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు....

Narendra Modi :  గాన కోకిల భారత రత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్‌ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనాతో జనవరి 11న ఆసుపత్రిలో చేరిన లతాజీ.. చికిత్స పొందుతూనే ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఆమె మరణంతో యావత్‌ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేస్తున్నారు.

ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. ”లతా దీదీ మరణించినందుకు చాలా బాధ పడుతున్నట్లు, ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఆమె పాడిన పాటలు ఎంతో పేరు గడించాయని, భారతదేశం ఎప్పుడూ అభివృద్ధి చెందాలని కోరుకునే వారన్నారు. ఆమె శూన్యాన్ని మిగిల్చిందని, రాబోయే తరాలు ఆమెను గుర్తు పెట్టుకుంటారన్నారు. ఆమె మధురమైన స్వరం..ప్రజలను మంతమగ్ధులను చేసిందని కొనియాడారు. ఆమెలో ఎనలేని అసమాన సామర్థ్యం కలిగి ఉందన్నారు. సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. భారతీయ సినీ నేపథ్య సంగీతానికి చిరునామాగా మారిన గానకోకిల లతామంగేష్కర్ ఇకలేరు.” అని ట్వీట్ చేశారు.

Lata Mangeshkar : భారత గాన కోకిల ‘లతా మంగేష్కర్’ మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

అయితే ఆమె అంత్యక్రియలకు కూడా ప్రధాని హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె నివాసంలో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాబోతున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు ప్రధాని ముంబై చేరుకోనున్నారు. అయన చేరుకున్న తర్వాతే లతాజీ అంతక్రియలు జరిగే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు