Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ ఘటనలో..మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చిన పోలీసులు..

సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా తాజగా పోలీసులు మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చారు.

Police gave a big shock to Mythri movie makers in Sandhya theater incident

Sandhya Theatre Incident : తాజాగా అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ ఘటనకి సంబంధించి విచారించిన సంగతి తెలిసిందే. దాదాపుగా 3 గంటల కంటే ఎక్కువే అల్లు అర్జున్ ను విచారించారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం ఇంటికి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్. అయితే ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ బౌన్సర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.

కాగా సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా తాజగా పోలీసులు మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే అల్లు అర్జున్ A11 గా ఉండగా ఇప్పుడు ఏకంగా A18 గా మైత్రి మూవీ మేకర్స్ ని చేర్చారు పోలీసులు. A1, A2 గా సంధ్యా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ ఉండగా, A3 గా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చెయ్యగా అందులో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ ను ఇప్పటికే ఒక రోజు జైల్లో కూడా పెట్టారు.

Also Read : Yash : విలన్ పాత్ర కోసం అన్ని వందల కోట్లు.. స్టార్ హీరోలని మించే రెమ్యూనరేషన్..

ఇక ఈ రోజు జరిగిన విచారణలో అల్లు అర్జున్ కి చాలానే ప్రశ్నలు ఎదురయ్యాయి. విచారణ ఈ ఒక్క రోజుతో అయిపోలేదట. మళ్ళీ విచారణకు బన్నీ రావాలట. రెండో సారి కూడా అల్లు అర్జున్ కి నోటీసులు పంపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ముందు ముందు అల్లు అర్జున్ కి ఇంకా ఎలాంటి చిక్కులు ఎదురవుతాయో చూడాలి.