Police given notices to Ramgopal varma
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లిన మద్దిపాడు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లని కించపరిచే విధంగా రామ్‌గోపాల్ వర్మ పోస్టింగ్స్ పెట్టాడని మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్‌లో పోస్టు చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ మండల కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.
Lokesh Kanagaraj : బాలీవుడ్ మీద కన్నేసిన లోకేష్ కనగరాజ్!
ఆయన ఫిర్యాదు మేరకు మూడు రోజులు క్రితం మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మద్దిపాడు పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ వర్మకు నోటీసులు అందించారు.
Varun Tej : మట్కా టీమ్‌తో కలిసి తిరుమలలో వరుణ్‌తేజ్ సందడి