Allu Arjun : అల్లు అర్జున్ పై పోలీసుల ప్రశ్నల వర్షం.. విచారణలో ఏం జరుగుతుంది..?

ఈ రోజు విచారణకు వెళ్లిన అల్లు అర్జున్ ను ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలుస్తుంది.

Sandhya Theatre Tragedy

Allu Arjun : పుష్ప 2 సినిమా చూడడానికి అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియటర్ వద్ద తీవ్ర ఉద్ద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక అప్పుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె బాబు పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీ తేజ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు.

ఇక అల్లు అర్జున్ ఆ థియేటర్ కి వచ్చినందుకే అక్కడికి జనాలు ఎక్కువ రావడంతో ఆ తొక్కిసలాటలో ఆమె చనిపోయిందని అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసారు. ఇందుకు గాను ఒక రోజు జైలులో ఉన్న బన్నీ బెయిల్ పై బయటికి వచ్చాడు. కానీ నిన్న మళ్ళీ బన్నీ కి పోలీసులు నోటీసులు జారీ చేసారు. విచారణకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రావాలని అన్నారు.

Also Read : Allu Arha : ఎంతమంది వచ్చారో లెక్కపెడుతున్న అల్లు అర్హ.. వీడియో వైరల్..

ఇక ఈ రోజు విచారణకు వెళ్లిన అల్లు అర్జున్ ను ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా గంటన్నర నుండి అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట అధికారులు. రేవతి చనిపోయిన విషయం మీకు థియటర్ లో ఉన్నప్పుడు తెలీదా..? మీడియా ముందు తెలీదు అని ఎందుకన్నారు.? అసలు అనుమతి లేకుండా రోడ్ షో ఎలా చేశారు అని..? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతునట్టు సమాచారం.. దీనికి సంబందించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉన్నాయి.