Tamil Sankranthi Movies : తమిళ్‌లోకూడా సంక్రాంతి సినిమాల క్లాష్.. అక్కడ పొంగల్ బరిలో ఎవరెవరు ఉన్నారు?

తమిళ్ లో సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే సినిమాలు ఇవే..

Pongal 2024 Tamil Theater Releasing Movies List

Tamil Sankranthi Movies : మనకు సంక్రాంతి పెద్ద పండగ. దీన్నే తమిళనాడులో పొంగల్ అని గ్రాండ్ గా చేసుకుంటారు. అక్కడ కూడా భారీ పండగ వాతావరణం కనిపిస్తుంది. సంక్రాంతి అంటే టాలీవుడ్ కి మాత్రమే కాదు కోలీవుడ్ కి కూడా చాలా ముఖ్యం. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రావడానికి చూస్తాయి. వచ్చి రిజల్ట్స్ ఎలా ఉన్నా కలెక్షన్స్ రాబడతాయి. టాలీవుడ్ లో ఇప్పటికే ఓ సినిమా తప్పుకున్నా ఇంకో నాలుగు సినిమాలతో క్లాష్ ఉంది. ఇప్పుడు తమిళ్ లో కూడా సంక్రాంతికి అదే క్లాష్ ఏర్పడింది.

తమిళ్ లో సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే సినిమాలు ఇవే..

ధనుష్(Dhanush) హీరోగా తెరకెక్కుతున్న ‘కెప్టెన్ మిల్లర్'(Captain Miller) సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది.

శివకార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా తెరకెక్కుతున్న’అయలాన్'(Ayalaan) సినిమా కూడా జనవరి 12న రిలీజ్ కానుంది.

అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘మిషన్ చాప్టర్ 1′(Mission Chapter 1) సినిమా సంక్రాంతికి ప్రకటించారు కానీ ఇంకా డేట్ ప్రకటించలేదు.

కుష్బూ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ‘అరణ్మణై 4’ సినిమా కూడా సంక్రాంతికి ప్రకటించినా ఇంకా డేట్ రివీల్ చేయలేదు.

Also Read : Sankranthi Movies : 2024 సంక్రాంతి సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే.. ఈ సారి గెలిచే పందెంకోడి ఎవరో?

దీంతో తమిళ్ లో నాలుగు సినిమాలు సంక్రాంతికి పోటీగా నిలిచాయి. అయితే రజినీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన ‘లాల్ సలాం’ సినిమా కూడా ముందు సంక్రాంతికి అనుకున్నా ఆ తర్వాత వాయిదా వేసుకున్నారు. ఇక అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నా తెలుగులో భారీ క్లాష్ ఉండటంతో వెనక్కి తగ్గి కేవలం తమిళ్ లోనే రిలీజ్ అవుతున్నాయి.