Pooja Hegde Diwali celebrations with parents photos goes viral
Pooja Hegde : టాలీవుడ్ బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో దాదాపుగా చాలా మంది హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే కొంతకాలంగా పూజా హెగ్డే తెలుగులో కంటే బాలీవుడ్ లో ఎక్కువ జోరు చూపిస్తుంది. హిందీలో వరుస సినిమాలు లైన్ లో పెడుతుంది. అంతేకాదు తమిళ్ లో కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
Also Read : Vikkatakavi : వికటకవి : జీ5 లో మిస్టీరియస్ వెబ్ సిరీస్.. ఎప్పుడంటే..
తాజాగా ఈ భామ దీపావళి సందర్బంగా పలు స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది. దీపావళి సెలెబ్రేషన్స్ జరుపుకున్న పూజ హెగ్డే తన తల్లి తండ్రులతో కలిసి ఫోటోలకి ఫోజులిచ్చింది. రెడ్ కలర్ చీర కట్టుకొని తన పేరెంట్స్ మధ్యలో నిలుచుంది. అలాగే తన తమ్ముడు, అతని భార్య ఇద్దరితో ఉన్న ఫోటో కూడా షేర్ చేసింది. దీపావళి పిండి వంటలు, తమ ఇంట్లో లైట్స్ తో ఉన్న డెకరేషన్, కి సంబందించిన ఫోటోలు షేర్ చేసింది.
దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వగా.. పూజాతో పాటు ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీస్ సైతం తమ దీపావళి సెలెబ్రేషన్స్ కి సంబందించిన ఫొటోస్ షేర్ చేశారు. అల్లు అర్జున్, రష్మిక మందన, నిహారిక కొణిదెల.. ఇలా చాలా మంది తమ దీపావళి పండుగ ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.