Vikkatakavi : వికటకవి : జీ5 లో మిస్టీరియస్ వెబ్ సిరీస్.. ఎప్పుడంటే..

Naresh Agastya Megha Akash Vikkatakavi Mysterious web series on Zee5
Vikkatakavi : ఈ మధ్య కాలంలో ఎటువంటి అంచనాలు లేకుండా వస్తున్న చాలా సినిమాలు, సిరీస్ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అయితే తెలంగాణ బ్యాగ్ డ్రాప్ లో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఓ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : L2: Empuraan : మోహన్ లాల్ లూసిఫర్ ప్రీక్వెల్ వచ్చేస్తుంది.. L2 ఎంపురాన్ రిలీజ్ డేట్ అనౌన్స్..
ఈ సిరీస్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో వస్తుంది. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. జీ5 ఓటీటీ ద్వారా వికటకవి సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీనికి సంబందించిన పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. నవంబర్ 28 నుండి ఈ సీరిస్ రానుందని పోస్టర్ లో పేర్కొన్నారు.
ఇక ఆ పోస్టర్ గమనిస్తే ఓ అడవిలో నరేష్ అగస్త్య మండుతున్న కాగడ పట్టుకున్నారు. అలాగే హీరోయిన్ మేఘా ఆకాష్ లాంతర్ పట్టుకొని ఉంది. ఆ అడవిలో దేనికోసం వచ్చారన్నది తెలియాలి అంటే 28 నవంబర్ నుండి వచ్చే ఈ సీజన్ చూడాలి. అయితే ఇప్పటికే తెలంగాణ బ్యాగ్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఎలా ఉంటాయో చూసాం. ఇప్పుడు సిరీస్ ఏ విధంగా ఉంటాయన్నది చూడాల్సిఉంది.