L2: Empuraan : మోహన్ లాల్ లూసిఫర్ ప్రీక్వెల్ వచ్చేస్తుంది.. L2 ఎంపురాన్ రిలీజ్ డేట్ అనౌన్స్..

L2: Empuraan : మోహన్ లాల్ లూసిఫర్ ప్రీక్వెల్ వచ్చేస్తుంది.. L2 ఎంపురాన్ రిలీజ్ డేట్ అనౌన్స్..

Mohanlal Lucifer Prequel Coming L2: Empuraan Release Date Announced

Updated On : November 1, 2024 / 2:14 PM IST

L2: Empuran : బ్లాక్ బస్టర్ లూసిఫర్‌కి సీక్వెల్ ఎల్2: ఎంపురాన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రముఖ తమిళ బ్యానర్ లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి ఆశీర్వాద్ సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీతో సహా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు.

Also Read : Lucky Baskhar : అదరగొట్టిన దుల్కర్.. లక్కీ భాస్కర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా??

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న L2: ఎంపురాన్ మార్చి 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక ఈ మేజర్ అప్‌డేట్ ను ఓ ఆసక్తికర పోస్టర్‌తో వెల్లడించారు.

ఎంపురాన్ సినిమాను 2019లో ప్రకటించారు. అక్టోబర్ 2023లో దీని షూటింగ్ స్టార్ట్ చేశారు. UK, US, రష్యాతో సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఇక ఇందులో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, సూరజ్ వెంజరమూడులతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ డేట్ రావడంతో కొత్త పోస్టర్ వైరల్ గా మారింది.