Lucky Baskhar : అదరగొట్టిన దుల్కర్.. లక్కీ భాస్కర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా??

Dulquer Salmaan Lucky Baskhar movie First Day Collections
Lucky Baskhar : దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి నుండే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దుల్కర్ సైతం ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే మంచి విజయాన్ని అందుకుంది.
Also Read : Venkatesh And Anil Ravipudi : లుంగీ కట్టిన వెంకీ మామ.. ఇద్దరు హీరోయిన్స్ తో సంక్రాంతికి వస్తున్నాం అంటూ..
తాజాగా తొలిరోజు కలెక్షన్స్ వివరాలు తెలియజేసింది టీమ్. ఈమేరకు చిత్ర నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సరికొత్త పోస్టర్ షేర్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.12.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని తెలిపింది. దీపావళి బ్లాక్‌బస్టర్ అని అందులో పేర్కొంది. రెండో రోజు కూడా మంచి బుకింగ్స్ జరుగుతున్నాయట.
ఇక ఇందులో దుల్కర్ భార్యగా మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించింది. సాయి కుమార్, సచిన్ ఖేడేకర్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దుల్కర్ కి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ మంచి సక్సెస్ అయింది.