Venkatesh-Anil Ravipudi : లుంగీ కట్టిన వెంకీ మామ.. ఇద్దరు హీరోయిన్స్ తో సంక్రాంతికి వస్తున్నాం అంటూ..

Venkatesh-Anil Ravipudi : లుంగీ కట్టిన వెంకీ మామ.. ఇద్దరు హీరోయిన్స్ తో సంక్రాంతికి వస్తున్నాం అంటూ..

Venkatesh And Anil Ravipudi movie Title poster

Updated On : November 1, 2024 / 4:00 PM IST

Venkatesh And Anil Ravipudi : విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై వస్తున్న సినిమా #VenkyAnil3. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బ్లాక్‌బస్టర్‌ లు అయ్యాయి. మరో సారి ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.

Also Read : Ka Movie : దుమ్ము లేపుతున్న ‘క’.. కిరణ్ అబ్బవరం కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్..

తాజాగా ఈరోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో, సినిమా పండుగ ప్రాముఖ్యతను సూచిస్తూ ఈ టైటిల్ ఉంది. ఈ సినిమాను 2025 సంక్రాంత్రి కి విడుదల చేస్తామని పోస్టర్ లో పేర్కొన్నారు.  ఈ సినిమా సంక్రాంతి సమయంలో విడుదలకి సరిగ్గా సరిపోతుంది. టైటిల్ డిజైన్ చూసుకుంటే రంగోలి, తుపాకీ అంశాలతో క్రైమ్ థీమ్‌లలో ఉంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, లుంగీ ధరించిన వెంకటేష్ చాలా సీరియస్ గా తుపాకీ పట్టుకొని కనిపిస్తున్నారు. అలాగే ఆయన పక్కన ఐశ్వర్య రాజేష్ సాంప్రదాయ లుక్‌లో, మీనాక్షి చౌదరి మోడ్రన్ గా ఉన్నారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.