Ka Movie : దుమ్ము లేపుతున్న ‘క’.. కిరణ్ అబ్బవరం కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్..

Ka Movie : దుమ్ము లేపుతున్న ‘క’.. కిరణ్ అబ్బవరం కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్..

Ka Movie First day collections worldwide

Updated On : November 1, 2024 / 11:43 AM IST

Ka Movie : కిరణ్ అబ్బవరం నటించిన తాజా సస్పెన్స్ థ్రిల్లర్ ‘ క’ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు వెర్షన్ టాలీవుడ్ అభిమానులు, సినీ ప్రేమికుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సుజీత్, సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది.

Also Read : Shraddha Srinath : దీపావళికి చీరలో మెరిపిస్తున్న శ్రద్ధ శ్రీనాథ్.. ఫొటోలు..

దీపావళి బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు కిరణ్. రెండవ రోజు బుకింగ్స్ కూడా అద్భుతంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. తన్వి రామ్, నయన్ సారిక, అజయ్, అచ్యుత్ కుమార్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

Image

ముందు నుండి కిరణ్ అబ్బవరం చెప్తున్నట్టే క్లైమాక్స్ , ఇంటర్వెల్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మొత్తానికి అందరి అంచనాలను తిప్పి కొడుతూ, ట్రోలర్స్ నోరు మూయించేలా ‘క ‘ తో సక్సెస్ సాధించాడు కిరణ్.