పూజా పాప ఫాలోయింగ్ పెరిగిందిగా!
పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య అక్షరాలా ఎనిమిది మిలియన్స్‌కు చేరింది..

పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య అక్షరాలా ఎనిమిది మిలియన్స్‌కు చేరింది..
సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో తమ ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడంతో వారికి భారీ స్ధాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య పెరిగింది.
పూజా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన సినిమా అప్‌డేట్స్, వర్కౌట్స్ చేస్తున్న వీడియోస్ వంటివి షేర్ చేస్తుంటుంది. తన పోస్టులకి లైక్స్, కామెంట్స్ విపరీతంగా వస్తుంటాయి.
ప్రస్తుతం ఆమె ఫాలోయర్స్ సంఖ్య అక్షరాలా ఎనిమిది మిలియన్స్..
Read Also : జయలలిత బయోపిక్ ‘తలైవి’ – ఫస్ట్‌లుక్
తనను ఫాలో అవుతున్న వాళ్లకి థ్యాంక్స్ చెప్తూ, 8 మిలియన్స్ అని ఉన్న తన ఫోటో షేర్ చేసింది పూజా.. బ్యాగ్రౌండ్‌లో ఈఫిల్ టవర్ కనబడుతుంది. ఇటీవల ‘అల వైకుంఠపురములో’ పాటల చిత్రీకరణకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫోటో ఇది. ఈ సినిమాతో పాటు, రెబల్ స్టార్ ప్రభాస్ ‘జాన్’ (ప్రచారంలో ఉన్న పేరు), బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ సరసన నటిస్తోంది పూజా హెగ్డే.