Pooja Hegde : చంపేస్తామంటూ దుబాయ్‌లో పూజా హెగ్డేకి బెదిరింపులు.. నిజమేనా..?
పూజా హెగ్డే ఒక క్లబ్ ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లారట. అక్కడ ఆమెకు మరణ బెదిరింపులు ఎదురయ్యాయని, దీంతో ఆమె వెంటనే ఇండియాకి తిరిగి ప్రయాణం అయ్యారని సమాచారం. అసలు ఏమైంది..?
- gum 95921
- Published On : December 13, 2023 / 03:08 PM IST
Pooja Hegde gets death threats at dubai club opening event news viral
Pooja Hegde : టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ నుంచి హిందీ పరిశ్రమకి చెక్కేసే అక్కడ సినిమాలు చేస్తున్నారు. దీంతో ముంబై లోనే ఉంటూ అదిరిపోయే ఫోటోషూట్స్ చేస్తూ బాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, రీసెంట్ గా పూజా హెగ్డే.. ఒక క్లబ్ ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లారట. అక్కడ ఆమెకు మరణ బెదిరింపులు ఎదురయ్యాయని, దీంతో ఆమె వెంటనే ఇండియాకి తిరిగి ప్రయాణం అయ్యారని బాలీవుడ్ సంబంధించిన ఒక సమాచారం సంస్థ పోస్ట్ వేసింది. అసలు ఏమైంది..?
అక్కడ ఒక విషయంలో పూజా హెగ్డేకి మరొకరికి గట్టి వాదన జరిగిందట. ఇక ఈ వాదనలో ఎదుటివారు.. పూజని చంపేస్తామంటూ బెదిరించారట. దీంతో ఆమె అక్కడి నుంచి వెంటనే ఇండియాకి తిరిగి ప్రయాణం అయ్యారట. ఈ విషయం పై పూజా హెగ్డే నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఏమైందని కంగారు పడుతున్నారు. ఆమె ఇండియాలో ఎప్పుడు ల్యాండ్ అవుతారో..? అని ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Tollywood : డ్రగ్స్ విషయంలో సినిమా ఇండస్ట్రీని హెచ్చరించిన హైదరాబాద్ కొత్త సీపీ..
అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని, ఇది కేవలం రూమరే అని తెలుస్తుంది. బాలీవుడ్ కి చెందిన కొందరు మీడియా పర్సన్స్ ఈ విషయం గురించి క్లారిటీ కోసం పూజా టీంని సంప్రదించారట. పూజా టీం.. ఈ వార్తలో నిజం లేదని కొట్టిపడేసినట్లు బాలీవుడ్ మీడియా తెలియజేసింది. ఇక పూజాకి బెదిరింపులు అంటూ పోస్ట్ చేసిన ఆ సంస్థ కూడా ఆ పోస్టుని డిలీట్ చేసేసింది. దీంతో పూజాకి బెదిరింపులు అన్న వార్త కేవలం రూమరే అని అర్ధమవుతుంది. కాగా పూజా రీసెంట్ గా షాహిద్ కపూర్ సరసన ‘దేవా’ అనే సినిమాకి సైన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2024 దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.
