రిలేషన్ బయటపెట్టిన హీరోయిన్.. ప్రియుడు ఎవరంటే!

  • Published By: sekhar ,Published On : October 29, 2020 / 01:55 PM IST
రిలేషన్ బయటపెట్టిన హీరోయిన్.. ప్రియుడు ఎవరంటే!

Updated On : October 29, 2020 / 2:26 PM IST

Poonam Bajwa Relationship With Suneel Reddy: గతకొద్ది కాలంగా హీరోయిన్ పూనమ్ బజ్వా రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలు వాస్తవాలే అని తాజాగా సోషల్ మీడియా ద్వారా కన్ఫామ్ చేసింది పూనమ్.

‘మొదటి సినిమా’ తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన పూనమ్‌ బాజ్వా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ప్రేమంటే ఇంతే’ పరుగు, బాస్’ సహా కొన్ని చిత్రాల్లో ఆమె నటించి మెప్పించింది. తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించిన పూనమ్‌కు కొద్ది కాలంగా అవకాశాలు రావడంలేదు.

నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఓం 3డి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సినిమాటొగ్రాఫర్ సునీల్ రెడ్డితో ఆమె కొంతకాలంగా రిలేషన్‌లో ఉంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘తిక్క’ మూవీ తర్వాత కన్నడలో Gaddappana Duniya అనే సినిమా డైరెక్ట్ చేశాడు సునీల్ రెడ్డి. అతని బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా తన లవర్‌, సోల్‌మేట్‌ సునీల్‌ రెడ్డిని పరిచయం చేసింది పూనమ్‌.

‘‘సునీల్‌ రెడ్డి, మై రూట్స్‌, గ్రౌండ్‌, హ్యండ్సమ్‌, మంచి హృదయమున్న నా లైఫ్‌ మేట్‌, సోల్‌మేట్‌కు హ్యాపీబర్త్‌డే. నీతో ఉండే ప్రతీ క్షణం ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది.. హ్యాపీ బర్త్‌ డే’’ అంటూ తన ప్రియుడిపై ప్రేమను వ్యక్తపరిచింది పూనమ్‌. సునీల్‌ రెడ్డితో కలిసి ఉన్న పలు ఫొటోలను కూడా పోస్ట్‌ చేసింది.