ఒంటరిగా ఎన్టీఆర్‌ ఘాట్‌‌లో హీరోయిన్.. తెలుగు ప్రజల దేవుడు అంటూ ప్రశంసలు

  • Publish Date - May 29, 2020 / 01:56 AM IST

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి 97వ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఆయనకు గురువారం(28 మే 2020)  నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నెక్లెస్‌ రోడ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద సినీనటి పూనమ్ కౌర్ కూడా ఆయనకు నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్‌కు ఒంటరిగా వెళ్లిన ఆమె అంజలి ఘటించి, అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల దేవుడు అని, స్వర్గంలో ఉన్న మీరు నన్ను ఆశీర్వదించండి. అంటూ ఆమె కోరారు.

భూమిపైన దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్ని ఇవ్వాలంటూ ఆమె కోరారు. మానవత్వం కరవైన ప్రస్తుత రోజుల్లో మీవంటి నేతలు, మీవంటి నటుల అవసరం ఈ సమాజానికి ఎంతో ఉందని ఆమె అన్నారు. 

Read: బాలయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు : మెగా బ్రదర్ నాగబాబు