Actress Vidyullekha Raman gets engaged: ప్రముఖ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే విద్యుల్లేఖా రామన్ ఈ లాక్‌డౌన్ సమయంలో బాగా సన్నబడ్డారు. ఈమె సన్నబడ్డటానికి కారణం ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోనుండడమేనని ఇప్పుడు సినీ అభిమానులకు అర్థమైంది.
గత కొంతకాలంగా ఫిట్‌నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ సంజయ్‌తో విద్యుల్లేఖా రామన్ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్ట్ 26న వీరి రోకా ఫంక్షన్ జరిగింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూ విద్యుల్లేఖా రామన్ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. నెటిజన్స్, సినీ ప్రముఖులు విద్యుల్లేఖా రామన్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
https://10tv.in/two-girls-marriage-kanpur-uttar-pradesh/