Posani Krishna Murali Joined in Hospital with Covid Features
Posani krishna Murali : టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ అటు సినిమాలతోను, ఇటు పాలిటిక్స్ తోను బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం సినిమాలలో నటించడమే కాక ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా పోసాని కృష్ణ మురళీ నేడు ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
Allu Arjun : శాకుంతలంలో అల్లు అర్హ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా.. బన్నీ స్పెషల్ ట్వీట్
గత కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతున్న పోసాని కృష్ణ మురళీ నేడు ఉదయం హైదరాబాద్ AIG హాస్పిటల్ లో చేరారు. కరోనా సోకినట్టు వైద్యులు అనుమానించి టెస్ట్ లు చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. గతంలో పోసాని ఆల్రెడీ రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు మరోసారి కరోనాతో హాస్పిటల్ లో చేరడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.