Allu Arjun : శాకుంతలంలో అల్లు అర్హ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా.. బన్నీ స్పెషల్ ట్వీట్

ఐకాన్ స్టార్ కూతురు అల్లు అర్హ చాలా చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ట్రైలర్ లో అల్లు అర్హ సింహం మీద వచ్చే షాట్ చూపించడంతో శాకుంతలం సినిమా కోసం సమంత అభిమానులతో పాటు అల్లు అర్జున అభిమానులు కూడా ఎదురుచూశారు.

Allu Arjun : శాకుంతలంలో అల్లు అర్హ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా.. బన్నీ స్పెషల్ ట్వీట్

Allu Arjun special Tweet on Allu Arha and Shakunthalam Team

Updated On : April 14, 2023 / 9:57 AM IST

Allu Arjun :  సమంత నేడు శాకుంతలం సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్(GunaSekhar) దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా నేడు ఏప్రిల్ 14న పాన్ ఇండియా(Pan India) రిలీజ్ అయింది. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో సమంత, చిత్రయూనిట్ కొన్ని రోజులుగా ఇండియా అంతటా ప్రమోషన్స్ భారీగా చేశారు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో శకుంతల తనయుడు భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించింది.

Shakunthalam : శాకుంతలం ట్విట్టర్ రివ్యూ.. సమంత కోసం మాత్రమే ఒక్కసారి చూడొచ్చంట..

ఐకాన్ స్టార్ కూతురు అల్లు అర్హ చాలా చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ట్రైలర్ లో అల్లు అర్హ సింహం మీద వచ్చే షాట్ చూపించడంతో శాకుంతలం సినిమా కోసం సమంత అభిమానులతో పాటు అల్లు అర్జున అభిమానులు కూడా ఎదురుచూశారు. బన్నీ అభిమానులు కూడా మొదటి రోజే ఈ సినిమాకు వెళ్లి అర్హ నటనని చూడాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడగా అల్లు అర్హ సినిమా చివరి 15 నిముషాలు కనపడుతుందని, యాక్టింగ్ అదరగొట్టేసింది, అల్లు ఫ్యామిలీ లెగసీని అర్హ భవిష్యత్తులో కంటిన్యూ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

Allu Arjun special Tweet on Allu Arha and Shakunthalam Team

తాజాగా అల్లు అర్జున్ శాకుంతలం టీంకి అల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. శాకుంతలం రిలీజ్ కు ఆల్ ది బెస్ట్. ఇలాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించిన గుణశేఖర్, నీలిమ గుణ, దిల్ రాజుకు నా బెస్ట్ విషెస్. స్వీటెస్ట్ లేడీ సమంత, నా మల్లు బ్రదర్ దేవ్ మోహన్ కు కూడా శుభాకాంక్షలు. మీ అందరికి అల్లు అర్హ చేసిన చిన్న గెస్ట్ పాత్ర నచ్చుతుంది అనుకుంటున్నాను. అర్హను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు, తనని జాగ్రత్తగా చూసుకున్నందుకు గుణశేఖర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు అల్లు అర్జున్.