Posani Krishna Murali: పోసానికి కరోనా పాజిటివ్..!

సినీ ప్రముఖుడు మరొకరు కరోనా బారినపడ్డారు. నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది.

Posani Krishna Murali

Posani Krishna Murali: సినీ ప్రముఖుడు మరొకరు కరోనా బారినపడ్డారు. నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. కరోనా పాజిటివ్ వచ్చినవెంటనే ఆయన గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా బారినపడటంతో పోసాని నటిస్తున్న రెండు సినిమాల షూటింగ్స్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. తన కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంపై పోసాని స్పందించారు.

కలిగిన అసౌకర్యం పట్ల దర్శక నిర్మాతలు, హీరోలను ఆయన క్షమించాలని కోరారు. అందరి ఆశీస్సులతో తొందరగా కరోనా నుంచి కోలుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొంటానని పోసాని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలతో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు కరోనా బారినపడ్డారు. కేసుల తీవ్రత తగ్గడంతో సినిమా షూటింగ్స్ మొదలయ్యాయి.