Bheemla Nayak: కలెక్షన్ల సునామీకి పవర్ స్టార్ స్కెచ్… ఫ్యాన్స్‌కు పునకాలే!
పవర్డ్ ఫ్యాన్స్ కు పండుగ డేట్ ఫిక్స్ చేశారు పవన్ కల్యాణ్. ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ వచ్చేదే అంటూ అందరికీ సూపర్ షాక్ ఇచ్చారు. పట్టుమని 10 రోజులు కూడా టైమ్ ఇవ్వకుండా థియేటర్స్ లో..
- Naresh Mannam
- Published On : February 17, 2022 / 05:49 PM IST
Bheemla Nayak
Bheemla Nayak: పవర్డ్ ఫ్యాన్స్ కు పండుగ డేట్ ఫిక్స్ చేశారు పవన్ కల్యాణ్. ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ వచ్చేదే అంటూ అందరికీ సూపర్ షాక్ ఇచ్చారు. పట్టుమని 10 రోజులు కూడా టైమ్ ఇవ్వకుండా థియేటర్స్ లో కుమ్మెస్తా అంటోన్న భీమ్లా… కలెక్షన్ల సునామీకి స్కెచ్ వేసాడా? ఫిబ్రవరి 25 వరకు ఉన్న గ్యాప్ లో పవన్ హడావిడీ ఎలా ఉండబోతుంది?
Movies Leakage: లీకుల బెడద.. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్!
ఫిబ్రవలరి 25న వచ్చేయడం పక్కా అని తేల్చేశాడు భీమ్లానాయక్. పరిస్థితులను బట్టి ఫిబ్రవరి 25 లేదంటే ఏప్రిల్ 1 అంటూ రెండు డేట్స్ బుక్ చేసుకున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. మొత్తానికి ఈ నెల ఎండింగ్ కే ఓటేశాడు. అయితే పవర్ స్టార్ థియేటర్స్ లో దిగేది ఏప్రిల్ 1కే అని ఫిక్సయిన శర్వానంద్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలకు ఈ నిర్ణయంతో గట్టి షాక్ తగిలిందిప్పుడు.
Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!
పవర్ స్టార్ కాంబోలో రానా నటించిన భీమ్లా నాయక్ పై ఫస్ట్ నుంచి ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. దానికి తగ్గట్టే ఈ మూవీ టీజర్, సాంగ్స్.. సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. థియేటర్స్ కి పవన్ ఎప్పుడొస్తారా అని కాచుక్కూర్చున్నారు ఫ్యాన్స్. భీమ్లానాయక్ కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ సైతం నమ్మకంతో ఉంది. ఎప్పుడొచ్చామన్నది కాదు.. సినిమాలో విషయముంటే బాక్సు బద్దలే అని అఖండ లాంటి సినిమాలు లేటెస్ట్ మార్క్ సెట్ చేశాయి. సో సేమ్ హోప్ తో బరిలోకి దూకబోతున్నారు పవర్ స్టార్.
Mahesh-Vijay: ఫ్యాన్స్ మధ్య సిల్లీ వార్.. దెబ్బకి నెవెర్ బిఫోర్ రికార్డ్స్!
ఫిబ్రవరి 24న అజిత్ వలిమై తమిళ్ తో పాటూ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఫిబ్రవరి 25న గంగూబాయ్ కతియావాడి కూడా థియేటర్స్ బుక్ చేసుకుంది. టాలీవుడ్ నుంచి భీమ్లా నాయక్ తో కలిసి ఎవరొస్తారో చూడాలి. ఇక రిలీజ్ డేట్ కి ఎక్కువ టైమ్ లేకపోవడంతో ప్రమోషన్స్ హైస్వింగ్ లో చేయబోతుంది భీమ్లా నాయక్ టీమ్. అతిత్వరలో పవన్, రానా కనిపించే ప్రమోషనల్ సాంగ్ తో పాటూ ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
