పవర్‌స్టార్ బర్త్‌డే ట్రీట్.. PSPK 28 అప్‌డేట్

  • Publish Date - August 31, 2020 / 05:48 PM IST

PSPK 28 Update: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న జనసేనాని పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా అప్‌డేట్‌ ఇవ్వనున్నారు. కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవర్‌స్టార్ కమ్‌బ్యాక్‌లో స్పీడ్ పెంచారు. పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా కొంతభాగం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

27వ సినిమా క్రిష్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 28వ సినిమాను తనకు ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు కళ్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది.

పవన్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు అప్‌డేట్ ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ లేదా ఫస్ట్‌లుక్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. అలాగే ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం.