Powerstar Pawan Kalyan Birthday Special Updates: కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీలో పవన్ స్పీడ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. పవర్ స్టార్ సినిమాల లైనప్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన 26వ సినిమాగా ‘వకీల్ సాబ్’ చేస్తున్నారు పవన్. ఈ వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్ 2) పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. లాయర్ గెటప్‌లో పవన్ లుక్ అదిరిపోయిందంటూ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
మొత్తానికి ఈ పుట్టినరోజు నాడు రెండు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్, మరో రెండు అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు పవర్ స్టార్..