Prabhas Adipurush Jai Shri Ram creating records in youtube
Adipurush : ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ఆదిపురుష్ నుంచి ఇటీవల ‘జై శ్రీరామ్’ అనే సాంగ్ రిలీజ్ అయ్యిన విషయం అందరికి తెలిసిందే. అజయ్ – అటుల్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి తెలుగు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి అందించాడు. దాదాపు 30 మంచి కోరస్ సింగర్స్ తో కలిసి అజయ్ – అటుల్ పాడిన ఈ పాట ప్రతి ఒక్కరికి ఒక మంత్రంలా ఎక్కేసింది. ఇక యూట్యూబ్ లో కూడా ఈ సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మే 20న రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డు వ్యూస్ అండ్ లైక్స్ ని అందుకుంటుంది.
తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 100M పైగా వ్యూస్ ని, 1.4M పైగా లైక్స్ ని అందుకొని ప్రపంచంలో ఎక్కువ వ్యూస్ అందుకున్న సాంగ్ గా సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ తో కూడా ప్రభాస్ యూట్యూబ్ లో వరల్డ్ రికార్డుని క్రియేట్ చేశాడు. ఆదిపురుష్ ట్రైలర్ కూడా 100M వ్యూస్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ నటించిన ఇంతకు ముందు సినిమాలు.. బాహుబలి 2, సాహూ, రాధే శ్యామ్ ట్రైలర్స్ కూడా యూట్యూబ్ లో 100M వ్యూస్ ని సాధించాయి. ఇలా వరుసగా 4 సినిమాలు 100M వ్యూస్ అందుకోవడం రికార్డు అంటున్నారు.
Salaar : సలార్ నుంచి అప్డేట్.. ఆమె పాత్ర షూటింగ్ పూర్తి.. టీజర్ అప్పుడే వస్తుందా?
మరి ట్రైలర్ అండ్ సాంగ్ తోనే ఈ రేంజ్ రికార్డ్స్ ని సెట్ చేస్తున్న ప్రభాస్.. రేపు థియేటర్స్ లో సినిమాతో ఏ రేంజ్ రికార్డుని క్రియేట్ చేస్తాడో చూడాలి. కాగా ప్రభాస్ ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 6న తిరుపతిలో నిర్వహించబోతున్నారు.