Adipurush : రిలీజ్‌కి ముందే ఆదిపురుష్ సినిమా ప్రదర్శన.. గ్లోబల్ స్టేజ్ పై ప్రభాస్ సినిమాకి గౌరవం!
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందే అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీమియర్ కాబోతుంది.
- gum 95921
- Published on- April 18, 2023 / 10:08 PM IST
Prabhas Adipurush Premiered in Tribeca Film Festival before release
Adipurush : ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మైథాలిజికల్ మూవీ ఆదిపురుష్ కోసం దేశమంతటా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామాయణం కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్తా నాగే కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమా విడుదల కొన్ని టెక్నికల్ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలే చిత్ర యూనిట్ నుంచి మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాని జూన్ 16న ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు.
Salaar : రెండు భాగాలుగా సలార్.. కన్ఫార్మ్ చేసిన నటుడు దేవరాజ్!
అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రీమియర్ కాబోతుంది. న్యూయార్క్ లో జరగబోయే ట్రిబెకా ఫెస్టివల్ (Tribeca Film Festival) లో ఆదిపురుష్ ప్రీమియర్ వేయనున్నారు. జూన్ 7 నుంచి 18 వరకు జరగబోయే ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఆదిపురుష్ ని జూన్ 13న ప్రదర్శించనున్నారు. దీని తరువాత మూడు రోజులకు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ కి ముందే గ్లోబల్ స్టేజ్ పై ప్రదర్శితం కానుండడం ఆదిపురుష్ దక్కిన గౌరవం. కాగా విడుదలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టి టీజర్స్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తే ఆడియన్స్ లో మరింత బజ్ క్రియేట్ అవుతుంది.
ఈ సినిమాని దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో టీ-సిరీస్, రెట్రోఫైల్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఓం రౌత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆదిపురుష్ రిలీజ్ అయ్యేవరకు తన తదుపరి సినిమాలు నుంచి ఎటువంటి అప్డేట్స్ రాకుండా ఆయా సినిమాల దర్శకనిర్మాతలకు ఆర్డర్ పాస్ చేశాడట.
